Jun 09,2023 13:34

ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమ గోదావరి జిల్లా) : ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి తీసుకువచ్చిన కౌలు రైతుల చట్టాన్ని సవరించవలసిందేనని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.సూర్య నారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన కౌలు రైతు రక్షణ జీపుహొయాత్రహొ శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం నుంచి ఆచంట మండలం, వల్లూరు, కరుగోరుమిల్లి, కందరవల్లి, కొడమంచిలి, మీదుగా ఆచంటకు చేరుకుంది. ఈ సందర్భంగా కచేరి సెంటర్లో జరిగిన బహిరంగ సభలో సూర్యనారాయణ మాట్లాడుతూ ... ప్రభుత్వ పథకాలన్నీ భూ యజమానులకే దక్కుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు గుర్తింపు కార్డులు కోసం భూ యజమానులు సంతకం పెట్టడం లేదని కౌవులు రైతులకుహొ భరోసా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కౌలు రైతుల కష్టాలు తీరాలంటే కౌలు రైతులహొ చట్టాన్ని పూర్తిగా మార్చాలని డిమాండ్‌ చేశారు. కౌలు రైతుల సమస్యలపై ఈనెల 12న విజయవాడలో జరిగే మహా పాదయాత్రలో కౌలు రైతులందరూ పాల్గని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌవులుహొ రైతులు సంఘం జిల్లా ఉపాధ్యక్షులుహొ బాలకఅష్ణ, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి మామిడి శెట్టి రామాంజనేయులు, జిల్లా అధ్యక్షులు కూసం పూడి సుబ్బరాజు, నాయకులు వద్దిపర్తి అంజిబాబు, సిర్రా నరసింహమూర్తి, పరువు మోహన్‌ రావు, తలుపూరి బుల్లబ్బాయి, పిల్లి ప్రసాద్‌, బంతు శ్రీను, కేతా కుర్మారావు. తదితరులు పాల్గొన్నారు.