ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు) : వెదురుకుప్పం మండలం బొట్లవారిపల్లి గ్రామానికి చెందిన రమేష్ (45) ఆరోగ్యం బాగాలేక బాధపడుతూ ఆ బాధ తట్టుకోలేక పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న టిడిపి జిల్లా అధ్యక్షులు చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జి పులివర్తి నాని సతీమణి పులివర్తి.సుధారెడ్డి బొట్లవారిపల్లి సోమవారం గ్రామానికి వచ్చి ఆయన మృత దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో వెదురుకుప్పం టిడిపి మండల మాజీ అధ్యక్షులు పి.మోహన మురళి, చిత్తూరు పార్లమెంటు తెలుగు యువత ఉపాధ్యక్షులు చంద్రబాబురెడ్డి, గ్రామస్తులు మోహన్ నాయుడు, అయ్యప్ప నాయుడు,మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు వరప్రసాద్,మండల ఐటీడీపి అధ్యక్షులు కార్తీక్, తదితరులు నివాళులర్పించారు.










