Apr 11,2023 14:35

ప్రజాశక్తి-గుత్తి(అనంతపురం) : విద్యుత్తు ట్రూ ఆఫ్‌ చార్జీలపై గుత్తిలో మంగళవారం టిడిపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రదర్శనగా ఏపీ ఎస్పీడీసీఎల్‌ ఇఇ కార్యాలయం చేరుకొని ప్రధాన గేటు వద్ద నాయకులు, కార్యకర్తలు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి మండల, పట్టణ కన్వీనర్లు బర్దివలి. రవిశంకర్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలపై ప్రభుత్వం రూ.57 వేల కోట్ల భారం వేసిందన్నారు. జగన్‌ ప్రభుత్వం పోయి టిడిపి ప్రభుత్వం వస్తేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు. జగన్‌ పాలనలో ప్రజల అష్ట కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన విద్యుత్‌ చార్జీలు తగ్గించే వరకు పోరాటాలు కొనసాగిస్తామన్నారు. అనంతరం ఏపీఎస్పీడీసీఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ రాజశేఖర్‌ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచి భరత్‌, ఎంపీటీసీ ధనుంజయ, టౌన్‌ బ్యాంక్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులు జిలాన్‌, కృష్ణ, రాష్ట్ర ఎస్సీ సెల్‌ కార్యదర్శి దిల్కాశీనా, టౌన్‌ క్లస్టర్‌ ఇంచార్జి శ్రీకాంత్‌ చౌదరి, మాజీ ఎంపీపీ వీరభద్రయ్య, మాజీ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ శ్రీనివాస యాదవ్‌, నాయకులు సుధాకర్‌ నాయుడు, కె.గోవిందు, ఎస్‌ఎం.భాషా, నాగరాజు, ఎ.పులికొండ తదితరులు పాల్గొన్నారు.