ప్రజాశక్తి-వికోట(చిత్తూరుజిల్లా) : తెలుగు ప్రజలకు ప్రపంచంలో మంచి గుర్తింపుని తెచ్చిన మహనేత ఎన్టీఆర్ పేరుతో కొనసాగుతున్న యూనివర్సిటీ పేరును మార్చడాని వ్యతిరేకిస్తూ టిడిపి నాయకులు జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. ఈసందర్భంగా టిడిపి మండల అధ్యక్షులు రంగనాథ్ మాట్లాడుతూ.. వైసిపి నాయకులు అధికారం శాస్వతం కాదని గుర్తించాలన్నారు. అన్నివర్గాల ప్రజలు తిరగబడే సమయం దగ్గర పడిందన్నారు. మరలా యూనివర్సిటీకి ఎన్టీఆర్ పెట్టెంతవరకు పోరాడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు.










