Jan 04,2023 11:52

ప్రజాశక్తి-గుడిపల్లి (చిత్తూరు) : బి.కుప్పం నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడో రోజుల పర్యటనలో భాగంగా ... బుధవారం టిడిపి ప్రచార వాహనాలన్నీ శాంతిపురం మండలానికి బయలుదేరాయి. ఈ నేపథ్యంలో గుడిపల్లి పోలీసులు ప్రచార వాహనాలను అడ్డుకొని స్టేషన్‌ పరిధిలో ఉంచారు. దీంతో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు భారీగా పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుంటున్నారు.