ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : సింగనమల నియోజకవర్గం నార్పల మండలం వెంకటాంపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త కొట్టం శ్రీరాములు కుమారుడు కొట్టం రమేష్ గత కొద్ది రోజుల క్రితం విద్యుత్ షాక్ తో మృతి చెందారు. ఆయన కుటుంబానికి రాష్ట్ర కార్యదర్శి ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు, నాగేంద్ర, ముగ్గురు ఆ గ్రామ టిడిపి నాయకుల తో కలిపి లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఆలం నరసానాయుడు మాట్లాడుతూ ... నిరుపేద కార్యకర్త యువకుడు కొట్టం రమేష్ మృతి చెందడం పార్టీకి తీరని లోటు అని అన్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో చురుకు గా పాల్గొన్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కి, కాలవ శ్రీనివాసుల దఅష్టికి ద్విసభ్య కమిటీ తరపున బాధిత కుటుంబ పరిస్థితిని తెలిపి రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ రావడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రమేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం సంతృప్తినిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఎర్ర నాగప్ప, మాజీ ఎంపీటీసీ రాఘవ నాయుడు, ప్రకాష్, గ్రామ కమిటీ అధ్యక్షుడు పి.నారాయణస్వామి, ఎస్.రామ్మోహన్, మీసాల అదెన్న, ప్రకాష్, నాగేష్, గిత్తల నారాయణస్వామి, పి.తిరుపతయ్య, పి.అదేన్న, కోడె తిరుపతి, కోడె చంద్ర, ఎన్.వలి, ఉషెన్ పీరా, ఎన్.దుబ్బి, ఖాదర్, హెచ్.కుళ్ళయప్ప, నాగరాజు, విబి.నారాయణస్వామి, ఎన్.సిద్ధయ్య, వడ్ల సుబ్రమణ్యం, బ్రంహనంద, తలారి ఎర్రిస్వామి, పట్రకళ్ళు భాష, కత్తి రమంజి, తదితరులు పాల్గొన్నారు.










