ప్రజాశక్తి - ఎస్‌ఆర్ పురం(చిత్తూరు) : ప్రమాదంలో గాయపడిన జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి కటికపల్లి శేఖర్‌ని టిడిపి రాష్ట్రా రైతు ప్రధాన కార్యదర్శి మనోహర్ నాయుడు, గంగాధర నెల్లూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ చిట్టిబాబు నాయుడుతో పాటు పలువురు నాయకులు పరామర్శించారు. ఆదివారం మండలంలోని కటికపెల్లి గ్రామపంచాయతీ కటిక పల్లి గ్రామానికి చెందిన టిడిపి జిల్లా తెలుగు యువత కార్య నిర్వహణ కార్యదర్శి కటికపల్లి శేఖర్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. విషయం తెలుసుకున్న టిడిపి నాయకులు ఆయన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జయ శంకర్ మాజీ ఎంపీటీసీ కేఎం రవి నాయకులు నిరంజన్ రెడ్డి,నోమేశ్వర్ రెడ్డి, నరేష్, తేజ ప్రసాద్, మురగయ్య, రాజేంద్రయ్య, సోము, పాలసముద్రం రవి, చల్ల చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.










