Jun 07,2023 11:53

హిందూపురం (అనంతపురం) : విద్యార్థులకు ఆర్టీసీ బస్సు పాసులు ఇవ్వాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ చేసింది. బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి మాట్లాడుతూ ... రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల ఒకటవ తేదీ నుంచి ఇంటర్మీడియట్‌ డిగ్రీ పీజీ విద్యార్థులకు కళాశాలలు ప్రారంభమయ్యాయని, విద్యార్థులందరూ కళాశాలలకు వస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, రవాణాకు వ్యవస్థవారు ఇప్పటివరకు విద్యార్థులకు బస్‌ పాసులు ఇవ్వడం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. బస్సు పాస్‌ పైన ఆధారపడిన విద్యార్థులు కళాశాలకు రావడానికి, పోవడానికి సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతూ కళాశాలలకు వస్తున్నారు అని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు సరైన సమయానికి బస్సు పాసులను అందించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘంగా డిమాండ్‌ చేస్తున్నామన్నారు.