ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా శ్రీనివాస్ ప్రసాద్ సోమవారం ఉదయం పదవీ బాధ్యతలు స్వీకరించారు. కూడేరు మండలం జెడ్పీ పాఠశాల నుంచి బదిలీపై వచ్చారు. ఆత్మకూరు హెచ్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న రాఘవయ్య బదిలీపై శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలానికి వెళ్లారు. హెచ్‌ఎం శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ ... విద్యార్థులకు మంచి బోధన నేర్పిస్తామని, మెనూ ప్రకారము మంచి భోజనం పెడతామని తెలిపారు.










