ప్రజాశక్తి-వెల్దుర్తి(కర్నూలు) : వెల్దుర్తి మండలం నూతన ఎంపీడీవోగా శివమల్లేశ్వరప్ప బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న శ్రీనివాసులు గడివేముల ఎంపీడీవోగా బదిలీ అయ్యారు. శివమల్లేశ్వరప్ప గతంలో గడివేములలో ఇంఛార్జి ఎంపీడీవోగా పని చేశారు. ఈ సందర్భంగా శివమల్లేశ్వరప్పను సహచర ఉద్యోగులు పూలబోకెలు అందజేసి సాధరంగా ఆహ్వనించారు.










