Apr 11,2023 14:55
  •  పట్టించుకోని అధికారులు

ప్రజాశక్తి ఆత్మకూరు(అనంతపురం) : పైన పటారం లోన లొటారం అన్న చాందసానా ప్రభుత్వాసుపత్రి ఉన్నా, వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో లేకపోవడం విచారకరమని ఆత్మకూరు మండలం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండల ప్రభుత్వ ఆసుపత్రిలో గతంలో 47 నుంచి 41 సిబ్బంది వరకు వైద్య సేవలు అందించేవారు. ప్రస్తుతం మండల ప్రభుత్వ వైద్యశాలలో కేవలం ఇరువురు ప్రధాన వైద్యులతో పాటు హెడ్‌ నర్సులు,నర్సులు, అందరూ కలిసిన 12 మంది వైద్య సేవలు అందిస్తున్నారు. వారు అందిస్తున్న వైద్య సేవలు కూడా అంతంత మాత్రమే. ఉన్న ప్రధాన వైద్యుడు వారంలో కనీసం ఒక్కరోజు కూడా, ఆత్మకూరు మండల కేంద్రానికి విధులకు రాకపోవడం విచారకరం. ప్రశ్నిస్తే క్యాంపులో ఉన్నామంటూ సమాధానం తప్ప, వారి నోట వేరే మాట రాదు. మండల కేంద్ర ఆస్పత్రి నుంచి మెడికల్‌ కాలేజ్‌ సర్వజన ఆస్పత్రిగా అప్గ్రేడ్‌ చేసినప్పటికీ, అందుకు తగ్గట్టుగా సిబ్బంది లేరు. ఆత్మకూరు మండలంలో టిడిపి హయాంలో మాజీ మంత్రి పరిటాల సునీత వైద్య సేవలు అందించే వైద్యుల కోసం ప్రత్యేక భవన సముదాయం ఏర్పాటు చేశారు. కోట్లాది రూపాయలు వెచ్చించారు. అయితే నేటికి ఆ భవనాలు వృధాగానే పడి ఉన్నాయి. గర్భవతులు బాలింతలతో కిటకిటలాడుతున్న ప్రభుత్వ వైద్యశాలలో కనీసం శస్త్ర చికిత్సలు చేసే వైద్యుడును ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరం . అత్యవసరాల వైద్య సేవలు అందించాల్సిన సిటీ స్కానింగ్‌ ఎమ్మారై స్కానింగ్‌ తదితర పరికరాలు అందుబాటులో లేకపోవడంతో, జిల్లా వైద్య కేంద్రానికి వెళ్లక తప్పడం లేదు. ఏది ఏమైనా ఆత్మకూరు మండలం ప్రభుత్వ వైద్యశాలకు పట్టిన రోగ దుస్థితిపై జిల్లా ప్రభుత్వ వైద్య సిబ్బంది ఆత్మకూరు వైద్యశాలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు.