Apr 28,2023 10:14

ప్రజాశక్తి ఆచంట ( పశ్చిమ గోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట గ్రామానికి చెందిన మృత్యుంజయ సహకార పరపతి సంఘం చైర్‌ పర్సన్‌ గా పనిచేస్తున్న వైట్ల శారదా దేవి (65) గుండెపోటుతో శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఈమెకు ఏకైక కుమారుడు వైట్ల కిషోర్‌ కుమార్‌. రాష్ట్ర వైసీపీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆమె అకాల మృతి పట్ల ఆచంట నియోజకవర్గం ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఏఎంసీ చైర్మన్‌ చిల్లే లావణ్య, డైరెక్టర్లు, సర్పంచ్‌ కోట సరోజినీ వెంకటేశ్వరరావు, సొసైటీ పర్సన్స్‌ పెచ్చెట్టి సత్యనారాయణ, మొండే శ్రీనివాస్‌, సొసైటీ కార్యదర్శి పారుపల్లి ఏసురత్నం, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా గోపాలన్‌, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, సొసైటీ అధ్యక్షులు చైర్‌ పర్సన్స్‌, వైసిపి నాయకులు, కార్యకర్తలు, టిడిపి జనసేన, సిపిఎం నాయకులు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసి, ఆమె కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.