ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : ప్రభుత్వము ప్రతి సంవత్సరం అందించే ఉగాది పురస్కారానికిగాను ఉత్తమ సేవ పథకానికి పుట్లూరు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ లక్ష్మయ్య ఎన్నికయ్యారు. హెడ్ కానిస్టేబుల్ లక్ష్మయ్య పోలీస్ శాఖలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను ప్రభుత్వ సేవ పథకం అవార్డు ప్రకటించింది అని ఎస్సై వెంకట ప్రసాద్ శనివారం తెలిపారు . అవార్డుకు ఎంపికైనందుకు హెడ్ కానిస్టేబుల్ లక్ష్మయ్య ను అధికారులు, పోలీస్ సిబ్బంది అభినందించారు.










