Aug 18,2023 12:28

ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : మండల పరిధిలోని మడ్డిపల్లి సచివాలయాలను శుక్రవారం ఎంపీడీవో యోగానంద రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ముందుగా అటెండ్‌ రిజిస్టర్‌ పరిశీలించారు. సచివాలయ సిబ్బందితో మాట్లాడుతూ ... వైఎస్సార్‌ బీమా, జగనన్నకు చెబుదాం స్పందన లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సచివాలయం సిబ్బందికి సూచించారు. అదేవిధంగా డ్రాప్‌ అవుట్‌ పిల్లలను గుర్తించి వారిని స్కూల్లోకి చేర్పించే విధంగా కృషి చేయాలని సూచించారు. ఏమన్నా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అలా కాకుండా నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని సచివాలయ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముందుగా వెల్లుట్ల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయాన్ని ఆర్బికే కేంద్రాన్ని పరిశీలించారు. తొందరగా బిల్డింగును పూర్తిచేయాలని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ కు కాంట్రాక్టులకు సూచించారు.