Aug 31,2023 16:06

చిత్తూరు : బంగారుపాళ్యంలో మండల సర్వసర సమావేశంలో 170వవార్డు సర్పంచ్‌ ప్రకాష్‌ నాయుడు వినూత్న ప్రదర్శనతో బిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అందించిన 14. 15 ఆర్థిక నిధులను పక్కదోవ పట్టించి పంచాయతీల అభివృద్ధికి నోచుకోకుండా పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను వెంటనే పంచాయతీ ఖాతాల్లోకి జమ చేయాలని నిరసన తెలియజేశారు. అనంతరం పోలీసులు అదుపులో తీసుకుని పోలీస్‌ స్టేషన్‌ తరలించారు.