May 23,2023 12:22

ప్రజాశక్తి-బి.కొత్తకోట (రాయచోటి-అనంతపురం) : కరెంట్‌ షాక్‌ తగిలి సర్పంచ్‌ మృతి చెందిన ఘటన మంగళవారం బి.కొత్తకోటలో జరిగింది. పెద్దతిప్ప సముద్రం మండలం రంగసముద్రం గ్రామ సర్పంచ్‌ కొండా జగదీశ్వర్‌ రెడ్డి అలియాస్‌ (బాబు రెడ్డి) తన వ్యవసాయ బోరు వద్ద మరమ్మతులు చేస్తుండగా కరెంట్‌ షాక్‌ తగలింది. గమనించిన స్థానికులు హుటాహుటిన బి.కొత్తకోట ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే సర్పంచ్‌ మఅతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.