ప్రజాశక్తి-వెదురుకుప్పం ( చిత్తూరు జిల్లా) : సచివాలయ సర్వేయర్ తనపై దాడి చేశారంటూ... పంచాయతీ సర్పంచ్ మండల న్యాయస్థానానికి వెళ్ళి తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలో వెదురుకుప్పం మండలం గొడుగుచింత సర్పంచ్ నక్కా బాబుపై పెరుమాళ్లపల్లె గ్రామ సచివాలయ సర్వేయర్ దౌర్జన్యానికి దిగి దాడి చేశారని సర్పంచ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. శుక్రవారం తహసీల్దార్ పుల్లారెడ్డి కి ఫిర్యాదును అందజేశారు.










