Jun 07,2023 14:56

ప్రజాశక్తి-గణపవరం(పశ్చిమగోదావరి) : అనారోగ్యంతో ఇటీవల మరణించిన వరదరాజపురం గ్రామ సర్పంచ్‌ కొండేటి నరసింహమూర్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబ సభ్యులను జనసేన ఉంగుటూరు నియోజకవర్గం ఇంచార్జ్‌ పచ్చమట్ల ధర్మరాజు బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసింహమూర్తి గ్రామ సర్పంచ్‌గా గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు జనసేన అండగా ఉంటుందని అన్నారు. ఈకార్యక్రమంలో తోట.పవన్‌, తోట.శ్రీను, తానేటి.జోగేశ్వరావు, బాలాజి, మద్దాల.ఉమ పాల్గొన్నారు