ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : ఆత్మకూరు పరిధిలో సనప గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న విఆర్‌ఓ రూటే సపరేటు. ఒక్కొక్క పనికి ఒక్కొక్క రేటు వసూలు చేస్తున్నట్లు గ్రామ ప్రజలు, రైతులు చర్చించుకుంటున్నారు. రిజిస్ట్రేషన్, డెత్ పట్టాదారు పాస్ పుస్తకాలు మార్చుకోవడం కోసం వేల రూపాయలు వసూళ్లు చేస్తున్నట్లు ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. జీరో ఎయిట్ కింద ఉన్న భూములను మార్చడానికి దళారులు పెట్టుకొని వాటికి వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు రైతులు చర్చించుకుంటున్నారు. వీటిపై జిల్లా ఉన్నంత అధికారులు స్పందించి ఇలాంటి విఆర్‌ఓ పై శాఖపరమైన తీసుకోవాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.










