Jan 05,2023 16:34

ప్రజాశక్తి - ఎస్‌ఆర్‌పురం (చిత్తూరు) : వైసిపి చీకటి జీవో రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ టిడిపి మండల అధ్యక్షులు గంధమనేని జయశంకర్‌ నాయుడు ఆధ్వర్యంలో మండల కేంద్రమైన ఎస్‌ ఆర్‌పురంలో గురువారం రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీ ఎత్తున్న ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్‌ షో, ర్యాలీలు, సమావేశాలకు వస్తున్న ప్రజాస్పందనను చూసి జీర్ణించుకోలేని వైసిపి ఓటమి భయంతో చీకటి జీవోలను తీసుకువచ్చిందన్నారు. ఈ జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పొన్న దామోదర్‌, కామసాని నిరంజన్‌ రెడ్డి, కేయం.రవి , హేమాద్రి యాదవ్‌ , సిద్దయ్య శెట్టి , నాగరాజు , బోడపటి బాలాజీ నాయుడు, కుమార్‌ , వెంకటాచలం, ధనంజయ నాయుడు, పుల్లూరు బాబు, మహబూబ్‌ బాషా, పుల్లూరు దాము, మాధవ నాయుడు , మోహన్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.