ప్రజాశక్తి -ఉరవకొండ :ఈ నెల 7న అనంతపురంలోని సిపిఐ కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, సిపిఐ నాయకులు పేర్కొన్నారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో గురువారం సమావేశానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ బాధితుల పట్ల సీఎం జగన్‌కు చిత్తశుద్ది లేకుండా పోయిందని ఆరోపించారు. అగ్రిగిల్డ్ సంస్థ దివాలా తీయడంతో మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఏజెంట్లు, ఖాతాదారులకు తీవ్ర అన్యాయం జరిగిందని వారు పేర్కొన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను అధికారంలో కి వచ్చిన ఆరు నెలలకే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానని నమ్మబలికి ఓట్లు దండుకుని నేడు వారికి న్యాయం చేయడం లేదని విమర్శించారు. అగ్రిగొల్డ్ బాధితుల పట్ల ఆగస్టు 15 లోపు సీఎం జగన్ తన హామీని నెరవేర్చాలని లేనిపక్షంలో బాదితులందరూ అమరావతి రాజధానికి చేరుకొని ఎపి అసెంబ్లీ సహా సీఎం ఇంటినిహొముట్టడిస్తామని హెచ్చరించారు.అందులో భాగంగానేహొ ఈనెల 7న అనంతపురంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నామన్నారు. ఈ సమావేశానికి అగ్రి గోల్డ్ బాధితులు అందరూ కూడా పాల్గోనాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అగ్ని గోల్డ్ కస్టమర్స్ మరియు ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సిద్దేశ్వర్,తిమ్మరాజు,సిపిఐ పార్టీ నాయకులు సుల్తాన్, బాధితులు మహేష్,ప్రభాకర్,సుదర్శన్,భాస్కర్,తదితరులు పాల్గొన్నారు.










