ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : నిండ్ర మండలం జి ఎన్ కండ్రిగ పంచాయితీ పరిధిలోని బిజీ కండ్రిగ , ఎంసీ కండ్రిగ గ్రామం.8.50. లక్షలతో అంచనా నిధులు తాగునీటి బోరు పైప్ లైన్‌ను రాష్ట్ర పర్యాటక, సంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్.కె.రోజా ప్రారంభించారు. నిండ్ర మండలం జి.ఎన్ కండ్రిక పంచాయతీ పరిధిలోని బీ.జీ కండ్రిగ ,ఎం.సీ కండ్రిగ గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన నిధులు అంచనా విలువ 8.50 లక్షలు,ఎమ్మెల్యే నిధులు అంచనా విలువ 2.50 లక్షలు మొత్తం అంచనా విలువ 11.00 లక్షల రూపాయలతో మంజూరు చేసిన తాగునీటి బోరు , పైపులైన్లకు మంగళవారం స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిండ్ర మండల ఎంపీపీ, దీప వైస్ ఎంపీపీలు, సర్పంచ్ లు, రాష్ట్ర డైరెక్టర్లు, శ్యామ్ లాల్ , ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










