ప్రజాశక్తి-ఉండి(పశ్చిమగోదావరి) : ప్రభుత్వం, నాయకులు పట్టించుకోకపోవడంతో సుమారు 1,50,000 రూపాయల సొంత నిధులతో సుమారు 80 మీటర్ల రహదారి నిర్మాణాన్ని గుర్రం వీర్రాజు తెలిపారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ.. ఉండి మండలం మహదేవపట్నం నుంచి వెలివర్రు వెళ్లే రహదారి పూర్తిగా అద్వాన స్థితిలోకి చేరిందని..రహదారి నిర్మించాలని పలుమార్లు అధికారులకు నాయకులకు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో 1,50,000 ఖర్చుతో రహదారి నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే గ్రామంలో తన తల్లిదండ్రుల పేరిట ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టడం జరిగిందని నిరుపేదలు ఫంక్షన్‌లు చేసుకోవడానికి నగదు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. గ్రామంలో తన తల్లిదండ్రులు పేరిట సేవ కార్యక్రమాలు చేయడానికి ముందు ఉంటానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. దీంతో స్వచ్ఛందంగా సొంత నిధులతో రహదారి నిర్మాణం చేపట్టిన గుర్రం వీర్రాజుకు పలువురు అభినందనలు తెలియజేశారు.










