ప్రజాశక్తి-పెద్దపంజాణి (చిత్తూరు) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రీసర్వేతో సమస్యలు రైతుల భూ సమస్యలు పరిష్కారం అవుతాయని కోగిలేరు సర్పంచు రమేష్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం కోగిలేరు గ్రామ పంచాయతీలో డ్రోన్ కెమెరాతో రీసర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీ సర్వే పూర్తయితే ఏళ్ల తరబడి నెలకొన్న భూసమస్యలన్నీ పరిష్కారమవుతాయని తెలిపారు. అలాగే కోగిలేరు గ్రామ పంచాయతీలోని నాలుగు గ్రామాల్లో మొత్తం 740 కుటుంబాలకు 4060ఎకరాల వ్యవసాయ భూమి ఉందని ఈ మొత్తాన్ని డ్రోన్ కెమెరాతో రెండు, మూడు రోజుల్లో సర్వే చేసి ఆ డేటా మొత్తం సంబందిత అధికారులకు అందజేయని మండల సర్వేయర్, ఆంజనేయులు తెలిపారు. రెవెన్యూశాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో భూముల పరిశీలన చేసి పూర్తిస్థాయిలో రెవిన్యూ, భూ సమస్యలను పరిష్కరించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారి, పంచాయతీ కార్యదర్శి గణపతి,ఎంపీటీసీ పరందామ, ఉప సర్పంచ్ ఈశ్వర్, సచివాలయ సర్వేయర్ అజిత, డిజిటల్ అసిస్టెంట్ జ్యోతిస్వరూప్, నాయకులు శివశంకర్ రెడ్డి, ప్రకాష్,సుబ్రమణ్యం,కిట్టన్న, వాలంటీర్లు సురేంద్ర, లోకేష్, పవన్, వినోద్, డ్రోన్ ఫైలట్ ముఖేష్ యాగాని, కుషాల్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.










