Jun 09,2022 16:30

ప్రజాశక్తి - ఎస్‌ఆర్‌ పురం(చిత్తూరు) : నియోజకవర్గ సమస్యలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి చిత్తూరు పార్లమెంట్‌ ఎస్సీ సెల్‌ అధికార ప్రతినిధి కొత్త పల్లి రమెష్‌ వినతి పత్రాన్ని గురువారం అందజేశారు. తొలుత మంగళగిరిలోని టిడిపి కార్యలయంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చం నాయుడుని చిత్తూరు పార్లమెంట్‌ ఎస్సీ సెల్‌ అధికార ప్రతినిధి కొత్త పల్లి రమెష్‌, తెలుగు యువత అధ్యక్షుడు మురళీమోహన్‌ చిరుతో కలిశారు. అనంతరం చంద్రబాబును కలిసిన వారు జిడి నెల్లూరు నియోజకవర్గం లోని సమస్యలను వివరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.