May 04,2023 12:26

ప్రజాశక్తి-ఉండి(పశ్చిమగోదావరి) : ఉండి గ్రామంలో రాజు డాక్టర్‌గా పేరుగాంచిన కలిదిండి రామచంద్ర రాజు బుధవారం హైదరాబాదులో అనారోగ్యంతో మరణించారు. కలిదిండి రామచంద్రరాజు మరణం వైద్య రంగానికి తీరని లోటని ఉండి లయన్స్‌ క్లబ్‌ ఉపాధ్యక్షులు గాదిరాజు రంగరాజు అన్నారు. ఈ సందర్భంగా గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. కలిదిండి రామచంద్రరాజు మంచి హస్తవాసి గల డాక్టర్‌ అని అతి స్వల్ప ఫీజు, అతి తక్కువ మందులు, సరైన రోగ నిర్ధారణ ఆ డాక్టర్‌ ప్రత్యేకత అని తెలిపారు. అందరూ రాజు డాక్టర్‌ అని పిలిచేవారన్నారు. పెదపుల్లేరుకు చెందిన ఆయన ఉండిలో చాలా కాలంపాటు వైద్య సేవలు అందించి మంచి డాక్టర్‌గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారన్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, తీవ్ర సంతాపం రంగరాజు వ్యక్త పరిచారు.