ప్రజాశక్తి-పలమనేరు(చిత్తూరు) : కొలమాసన పల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో రికార్డ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న కె.విద్యాశేఖర్ అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు ఆనందబాబు, జిల్లా ఎన్జీఓ సంఘం ఉపాధ్యక్షుడు లక్ష్మీపతి యాదవ్, పిఐయు సీనియర్ సహాయకులు రాజశేఖర్ తదితరులు విద్యాశేఖర్ మృతదేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. మతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విద్యాశేఖర్ కుటుంబానికి అన్ని విధాల సాయం అందజేస్తామని ఎన్జీఓ నేలతలు తెలిపారు.










