ప్రజాశక్తి-చిత్తూరు : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించడం జరుగుతోందని, సిబ్బంది కూడా అన్ని ఏర్పాట్లు చేసుకొని రీ సర్వే కార్యక్రమం ఎటువంటి ఇబ్బందులూ లేకుండా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం జాయింట్ కలెక్టర్ వెదురుకుప్పం మండల పర్యటనలో భాగంగా తహశీల్డార్ కార్యాలయంలో విఆర్‌ఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో భారీ ఎత్తున రీసర్వే కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. వెదురుకుప్పం మండలంలో మొత్తం 32 గ్రామాలకు గాను 12 గ్రామాలలో డ్రోన్ ఫ్లై పూర్తి అయిందని త్వరలోనే ఓ అర్ ఐ షీట్లు రానున్నాయని ఈ లోగా క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ భూములు,గ్రామ కంటాలను కొలవడం పూర్తి చేయాలని ఓఅర్‌ఐలు వచ్చిన తర్వాత 100 రోజులలో మిగతా ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.మ్యుటేషన్ దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని ప్రధానంగా రైతులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూడాలన్నారు.రీ సర్వే కార్యక్రమం 100సంవత్సరాల తర్వాత నిర్వహించబడుతోంది ఈ కార్యక్రమం ఒక ఛాలెంజ్‌గా ఎటువంటి తప్పులు లేకుండా నిర్వహించాలన్నారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తో పాటు తహసీల్డార్ పుల్లారెడ్డి ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.










