Jul 18,2023 20:06

రజనీకాంత్‌ కథానాయకుడిగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'జైలర్‌'. కళానిధి మారన్‌ సమర్పణలో సన్‌ పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి 'నువ్వు కావాలయ్యా' పాటని విడుదల చేశారు మేకర్స్‌. సంగీత దర్శకుడు అనిరుధ్‌ ఈ పాటని స్వరపరిచారు. అరుణ్‌రాజా కామరాజ్‌ రాసిన ఈ పాటను శిల్పారావు, అనిరుధ్‌ కలిసి ఎనర్జిటిక్‌గా పాడారు. మోహన్‌ లాల్‌, శివ రాజ్‌కుమార్‌ రమ్య కష్ణన్‌, తమన్నాతో పాటు వసంత్‌ రవి, నాగ బాబు, యోగి బాబు, జాఫర్‌ సాదిక్‌ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్టు 10న ఈ చిత్రం విడుదల కానుందని సమాచారం. రచన, దర్శకత్వం : నెల్సన్‌, సంగీతం : అనిరుధ్‌, డివోపీ: విజరు కార్తీక్‌ కన్నన్‌, ఎడిటర్‌: ఆర్‌.నిర్మల్‌, ఆర్ట్‌: డాక్టర్‌ కిరణ్‌.