Mar 06,2023 11:34

భీమవరం (పశ్చిమ గోదావరి) : పెంచిన గ్యాస్‌ ధరను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ .... భీమవరం మండలం రూరల్‌ వెంప గ్రామము కొత్తపేటవాసులు సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి ఇబ్బందులుపడుతుండగా, ఇప్పుడు గ్యాస్‌ ధరను కూడా అంతకంతకు పెంచుకుంటూపోతే తామెలా జీవించాలని వాపోయారు. వెంటనే పెంచిన గ్యాస్‌ ధరను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.