Jun 12,2023 12:49

ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా కల్లూరు విజయలక్ష్మి సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లి జెడ్పీ పాఠశాల నుంచి బదిలీపై వచ్చారు. గతంలో ఇదే మండలంలో ఎల్లుట్ల హెచ్‌ఎంగా విధులు నిర్వహించారు. పుట్లూరు హెచ్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీనరసింహ బదిలీపై సజ్జలదిన్నెకు వెళ్లారు.