Mar 22,2023 19:30

ప్రజాశక్తి -పాలకోడేరు(పశ్చిమగోదావరి) : పాలకోడేరు మండలం వేండ్ర ప్రాథమిక పాఠశాలలో 1983- 84 సంవత్సరంలో చదివిన పూర్వ విద్యార్థులంతా తిరిగి ఉగాది రోజు బుధవారం కలుసుకున్నారు. తాము చదువుకున్న పాఠశాలలోని తిరిగి పూర్వ విద్యార్థుల సమ్మేళన నిర్వహించుకోవడం తమకు విద్య నేర్పిన గురువులను ఘనంగా సన్మానించుకోవడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని పూర్వ విద్యార్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. 40 ఏళ్ల తర్వాత తిరిగి గ్రామంలో పాఠశాలలో ఇలా సమ్మేళనం నిర్వహించుకోవడం, తాము ఏ ఏ రంగంలో స్థిరపడ్డాము, ఏ విధంగా జీవిత గమనాన్ని కొనసాగిస్తున్నాము, తమ కుటుంబ సభ్యులు వివరాలతో ఒకరికొకరు పంచుకున్నారు. అనంతరం హుషారుగా ఆడి పాడారు. అందరూ సహపంక్తి భోజనాలు చేసి, స్వీయ చిత్రాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఏడి కష్ణ, డివి సుబ్బరాజు, పీహెచ్‌ విశ్వనాథరాజు, కె విజరు కుమార్‌, ఎం రమేష్‌ రాజు, జె శ్రీనివాసరావు, డిహెచ్‌ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.