- జిల్లా అధికారులకు కలెక్టర్ ఆదేశం
ప్రజాశక్తి-గణపవరం : ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా లేని పరిస్థితుల్లో రైతుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ధాన్యం కొనుగోలు వేగతరం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గురువారం గణపవరం మండలంలో మొయ్యేరులో ఉన్న ఆర్బికే కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఎంత వరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారు రైతులు ఎంతమంది వచ్చారు అని అడిగి తెలుసుకున్నారు. కేంపరీపద్రంలో ఉన్న తేమశాతం మిషన్. కాటాను.స్టాక్.రూమ్.లను పరిశీలించారు రైస్ మిల్లు నుండి ఏమైనా సమస్యలు వస్తే వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకోవాలని అన్నారు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే రైస్ మిల్లులను సీజ్ చేయాలని అధికారులకు ఆదేశించారు. ధాన్యం కొనుగోలుకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. రవాణా వేగతనం చేయడానికి లారీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. గోని సంచులు కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో గణపవరం తాసిల్దార్.పమ్మిలక్షి. ఎంపీడీవో జి జ్యోతిర్మయి వ్యవసాయ అధికారి వై ప్రసాదు ఆర్ బి కే సిబ్బంది పాల్గొన్నారు.










