ప్రజాశక్తి -ఎస్‌ఆర్ పురం(చిత్తూరు) : చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్‌ఆర్‌పురం మండలంలోని డీకే మరిపల్లి గ్రామంలో పాఠశాలకు ప్రవేశం లేదంటూ ముళ్ళ కంపలు వేసి విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన తెలిపారు. తొలుత డీకే మర్రిపల్లి ప్రాథమిక పాఠశాల నుండి తిరుపతి రోడ్డు వరకు ర్యాలీగా వచ్చి డీకే మర్రిపల్లి గ్రామం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వెదురుకుప్పం మండలం దేవలంపేట ఉన్నత పాఠశాల లో మూడవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు చేరాలి అనే ఆదేశాలు రావడంతో రోడ్డుపై నిరసన తెలియజేస్తున్నామని తెలిపారు. డీకే మర్రిపల్లి పాఠశాలలో 43 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. అందరూ దళిత కుటుంబానికి చెందినవారని పాఠశాలను విలీనం చేసి ఉన్నత చదువులకు దూరం చేయవద్దని నిరస తెలిపారు.











