ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : ఏడు రోజులుగా అనంతపురం మున్సిపల్ ఆఫీస్ ఎదుట ఇంజనీరింగ్ కార్మికులు సమస్యల పరిష్కారించానలి ఆందోళన చేస్తున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమనిఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కే నాగభూషణం అన్నారు. బుధవారం మున్సిపల్ ఆఫీస్ ముందర నల్ల బ్యాడ్జీలు కళ్ళకు గంతలు కట్టుకొని, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ.. ఏడు రోజులుగా మున్సిపల్ ఆఫీస్ ముందర ఇంజనీరింగ్ కార్మికుల తమ సమస్యలు పరిష్కారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని,మున్సిపల్ అధికారులకు, తమ ఆవేదన వ్యక్తం చేస్తుంటే, అటు రాష్ట్ర ప్రభుత్వం గానీ, ఇటు మునిసిపల్ ఆఫీస్ అధికారులు గానీ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇంజనీరింగ్ కార్మిక సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా 20,21వ తారీఖున జరగబోయే రిలే నిరాహార దీక్షలో చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనంఇవ్వాలని, 010 జీవో ప్రకారంగా వేతనాలు ఇవ్వాలని, ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్డ్ స్కిమీ స్కిల్డ్ అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇంజనీరింగ్ కార్మికులకు వర్తింపజేయాలని, 60 సంవత్సరాల రిటైర్మెంట్ పేరుతో తొలగించిన 12 మంది కార్మికుల కుటుంబాల్లో ఒకరు ఉపాధి కల్పించాలని,2011 సంవత్సరంలో ఇంజనీరింగ్ కార్మికులకు బకాయి ఉన్న 11 నెలల పిఎఫ్ వారి ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు, ఈనెల 27వ తారీఖున మున్సిపల్ ఆఫీస్ ని ముట్టడి చేస్తామని, అలాగే ఆగస్టు ఏడో తారీఖున, అనంతపురం జిల్లా మున్సిపల్ కార్మికులు అందరూ, కదం తొక్కుతూ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆందోళన చేపడతారని, అప్పటికి ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఆగస్టు 17న చలో విజయవాడకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఆరోజు నుంచే, సమ్మె బాట పడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి వై వెంకటనారాయణ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏటీఎం నాగరాజు, నగర కార్యదర్శి తిరుమలేష్, మురళి, రాయుడు, ఓబుల పత్తి, సూరి, సురేష్, సుధారాణి, లక్ష్మీదేవి, పోతలయ్య, మళ్లీ, ఇంజనీరింగ్ కార్మికులు పాల్గొన్నారు.










