Apr 14,2023 12:28

ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : ఆత్మకూరు మండల వ్యాప్తంగా రైతులు తమ వ్యవసాయ పంటలకు పశువులు, అడవి పందులు జంతువుల నుంచి నష్టం వాటిల్లకుండా తమదైన శైలిలో రక్షణ కల్పిస్తుంటారు. ఆత్మకూరు మండలంహొవ్యవసాయ భూములు ఆరుబయలుగా ఉంటాయి. మేత కోసం పశువులు మరియు అడవి పందులు తమ వ్యవసాయ పంట మొక్కజన్న వేరుశనగ మరియు టమోటా కోసం పచ్చని పంట పొలాల్లోనే పచ్చిక మేపడం అలవాటు. దీంతో గ్రామ పరిసరాల్లో ఉండే పంట పొలాలకు పశువుల వల్ల అటవీ ప్రాంతంలో ఉండే పంటచేలకు అడవి జంతువుల వల్ల ముప్పు వేరుశనగ మొక్కజన్న వరి చేనుకు కంచె కట్టి దానిచుట్టూ చీరలు కట్టిన దృశ్యం పలువురిని ఆకట్టుకుంటుంది. పచ్చని పంట పొలాలను రంగు రంగుల చీరలతో సింగారించినట్లుగా ఉంది . పచ్చగా ఎదుగుతున్న పంట పైర గాలికి ఆ చీరలు ఊగుతూ అడవిలో ఆ పచ్చని పొలం ఉన్న ప్రాంతాన్ని శోభాయమానం చేస్తున్నాయి. వీటికి తోడు రాత్రి పూట జంతువులు గుంపులు గుంపులుగా వచ్చి పంటలను పాడు చేయకుండా ఉండడం కోసం ఇలా చీరలతో ఆ చేనుకు రక్షణ కల్పించిన దఅశ్యం పలువురిని ఆకట్టుకుంటుంది. ఆ పంట పొలాలకు చీరలే రక్షణ కల్పించి. అటవీ సమీప హొపొలాల్లో సాగు చేసిన వరి మొక్కజన్న వేరుశనగ పైరును వన్యప్రాణుల నుంచి రక్షించుకునేందుకు అన్నదాతలు చీరలను వాడుతున్నారు. పంటల చుట్టూ వీటిని కట్టడం వల్ల జంతువులు దూరం నుంచి మనుషులు ఉన్నట్లుగా భ్రమిస్తాయని రైతులు చెబుతున్నారు. హొవాటిభారీ నుండి పంటలను రక్షించుకోవడానికి ఇలా చీరల అలంకరణ చేశామని స్థానిక రైతులు చెబుతున్నారు. ఇలా పంటల రక్షణ కోసం తమదైన శైలు రక్షణ కల్పించుకుంటున్నామని దాదాపు ఒక పంటకు రైతుకు దాదాపుగా 5000 వరకు వస్తుంది ప్రభుత్వ స్పందించి రైతులకు ఫెన్సింగ్‌ ఏర్పాటుకు రాయితీ అందిస్తే ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయని కనీస ఉద్యావన పంటలు సాగు చేస్తున్న రైతులకైనా ప్రభుత్వం 90 శాతం రాయితీ అందించాలని రైతులు కోరుతున్నారు.