ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : ఆత్మకూరు మండల పరిధిలో పంపనూరు గ్రామం ఉపాధి హామీ పథకం కింద మంజూరైన చెక్ డ్యాము ను జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి నాణ్యతను పరిశీలించారు. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ... ఈ పనులను త్వరగా పూర్తి చేసి నీటి నిల్వ ఉంచి రైతులకు బోరు బావులకు నీరు పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు. అవకాశమున్నచోట చెక్ డాం నిర్మించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో సుజాత, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.










