Mar 15,2023 12:46

ప్రజాశక్తి - చిత్తూరు : రీపోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసులు దౌర్జన్యం కొనసాగుతోంది. బుధవారం ప్రారంభమైన రీపోలింగ్‌లో అధికార పార్టీ నాయకులను పోలింగ్‌ బూత్‌లలోకి ఎందుకు పంపిస్తారని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి జనరల్‌ ఏజెంట్‌ గంగరాజు పోలీసుల్ని ప్రశ్నించారు. ఆయన ప్రశ్నించినందుకు వెంటనే సిఐ చంద్రశేఖర్‌ అతన్ని బలవంతంగా పోలింగ్‌ కేంద్రం నుంచి బయటకు నెట్టేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.