ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమ గోదావరి) : అప్పన్నపేటకు చెందిన సిపిఎం కార్యకర్త పట్నాల శ్రీనివాసు (58) మృతి సిపిఎంకి తీరని లోటు అని పార్టీ జిల్లా కార్యదర్శి. బి.బలరాం అన్నారు. సోమవారం ఉదయం బి.బలరాం మాట్లాడుతూ ... అప్పన్నపేటకు చెందిన శ్రీనివాసు కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిపారు. సరిపల్ల తన అత్తవారింటిలో వైద్యం పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు చెప్పారు. ఈరోజు సరిపల్లిలో జరిగిన శ్రీనివాసు అంత్యక్రియలలో సిపిఎం నేతలు పాల్గొని ఆయనకు జోహర్లు అర్పించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ... శ్రీనివాస్ 40 సంవత్సరాలపాటు కేశవరం ఏరియాలో పార్టీ ప్రజాసంఘాలలో అంకిత భావంతో పని చేశారని అన్నారు. పట్నాల శ్రీనివాసు మృతికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారామ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి. జక్కంశెట్టి సత్యనారాయణ, సోమవారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు. చింతకాయల బాబూరావు, రాజారామ్మోహన్‌రారు, భవన నిర్మాణ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి నారపల్లి.రమణారావు, మండల నాయకులు పెచ్చేట్టి నరశింహమూర్తి, పి.గోవిందు, ఎం.పెంటారావు, ఎస్.సంజీవిరావు, చిన్నంచిననాగేశ్వరావు, డి.రామలింగరాజు, తదితరులు పాల్గొన్నారు.










