ప్రజాశక్తి-ఉండి (పశ్చిమ గోదావరి) : మండల కేంద్రమైన ఉండి గ్రామంలోని దేవునిగుడిదొడ్డి ప్రాంతంలో బుధవారం ఉదయం గేదెల వ్యాపారం నిర్వహించే బూరాడ సత్తిబాబుకు చెందిన సుమారు రూ.40,000 విలువచేసే గడ్డిమేటు కరెంటు వైర్లు తగలడంతో దగ్ధమైంది. స్థానికులు స్పందించి వెంటనే భీమవరం అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం అందివ్వగానే జిల్లా సహాయ అగ్నిమాపక ఇంచార్జ్ సాలా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి అదుపు చేశారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.










