ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : స్థానిక పోలీస్ సిబ్బందితో కలిసి సోమవారం రాత్రి మండల పరిధిలోని గూగూడు గ్రామంలో ఎస్సై రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులతో గ్రామసభ ఏర్పాటు చేసి, దొంగతనాలు చైన్ స్నాచింగ్ లు రోడ్డు ప్రమాదాల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. జులై నెలలో బ్రహ్మౌత్సవాలు, ప్రారంభమవుతాయని బ్రహ్మౌత్సవాలకు చాలామంది కొత్త వ్యక్తులు గ్రామంలోకి వస్తారని ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించిన రాత్రి సమయంలో అనుమానస్పదంగా సంచరించిన వెంటనే నార్పల పోలీసులకు సమాచారం అందజేయాలని తెలిపారు. అంతేకాకుండా గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్యలు ఉంటే పోలీసుల దఅష్టికి తీసుకురావాలని, గ్రామంలో గొడవలుపడవద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించే పరిస్థితి లేదని కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయనతో పాటు స్థానిక పోలీసు సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.










