Jun 16,2023 11:33

ఎలమంచిలి (పశ్చిమ గోదావరి) : పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలం చించినాడ గ్రామం పెరుగులంక భూముల్లో అక్రమ తవ్వకాలను నిరసిస్తూ ... చేపట్టిన నిరసన దీక్షలు శుక్రవారం కొనసాగుతున్నాయి. ఈ నిరసన దీక్షలకు సిఐటియు మద్దతు తెలిపింది. చించినాడ గ్రామంలో దళితులు 40 సంవత్సరాలనుండి సాగు చేసుకుంటున్న భూముల్లో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ప్రసాదరాజు అండతో చేస్తున్న అక్రమ ఇసుక తవ్వకాలను ఆపాలని ఆందోళన చేస్తున్నారు. ఈ తవ్వకాల వల్ల పంటపొలాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం వారి గోడును పెడచెవిన పెట్టింది. తమ భూముల కోసం పోరాడుతున్న చించినాడ దళితులకు న్యాయం చేయాలని, అక్రమ తవ్వకాలను ఆపాలని సిపిఎం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.