Jun 22,2023 11:39

హైదరాబాద్‌ : తెలంగాణలోని వివిధ మెడికల్‌ కాలేజీల్లో ఈడీ అధికారుల బుధవారం సోదాలు నిర్వహించిన విషయం తెలసిందే. ఈ సోదాలు గురువారం కూడా కొనసాగుతున్నాయి. బొమ్మకల్‌ చల్మెడ ఆనందరావు మెడికల్‌ కాలేజీ, మేడ్చల్‌లోని మెడిసిటీ మెడికల్‌ కాలేజీ, సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. అలాగే సీట్ల భర్తీలో భారీగా హావాలా లావాదేవీలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం 6 కాలేజీల్లో ప్రారంభం కాగా కొన్నింట్లో పూర్తయ్యాయి. ఈడీ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.