May 22,2023 13:41

ప్రజాశక్తి - పెనుమంట్ర (పశ్చిమ గోదావరి) : ఉపాధి హామీ కూలీల ఉసురు తీసే ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌ ను వెంటనే రద్దుచేసి పాత మస్టర్‌ విధానాన్ని కొనసాగించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కం శెట్టి సత్యనారాయణ, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కూసంపూడి సుబ్బరాజు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం ఓడూరు, బ్రాహ్మణచెరువు ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్న ప్రాంతంలో నేతలు పర్యటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ... వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ఆక్వా సాగు ఇతర ప్రాంతాల కూలీలు వచ్చి పనులు చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి హామీ పట్టెడు అన్నం పెడుతోందని అన్నారు. ఇంత ప్రాధాన్యత కలిగిన చట్టానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కోత విధించడం విడ్డూరం అన్నారు. ఇప్పటికైనా పని దినాలు 200 రోజులు కనీస వేతనం రూ.600 తొలగించిన సమ్మర్‌ అలవెన్స్‌ తో పాటు సౌకర్యాలను కొనసాగించాలని, బడ్జెట్లో రెండు లక్షల 50 వేల కోట్లు రూపాయలు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఉపాధి హామీ సాధన కమిటీ అధ్యక్షులుగా నల్లి నాగేశ్వరరావు , ఉపాధ్యక్షులుగా బీరా వెంకట నరసమ్మ, కార్యదర్శిగా నేతల నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శిగా మైలే సులోచన, మరో ఆరుగురుతో గ్రామ కమిటీ ఏర్పడింది.