ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : ఈ నెల 17న సీఎం జగన్మోహన్ నార్పల కి రానున్నారు. అని అందుకోసం ఎమ్మెల్సీ తలసీల రఘురాం జిల్లా కలెక్టర్ గౌతమి ముఖ్యమంత్రి ప్రసంగించే సభా వేదిక స్థలం ఎలిప్యాడ్ స్థలాన్ని మంగళవారం స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి పరిశీలించారు. నార్పల మండల కేంద్రం నుండి వసతి దీవెన పథకం కింద జగనన్న నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమ చేయనున్నారు. జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన బహిరంగ సభావేదిక నుంచి సీఎం బటన్ నొక్కి నిధులు జమ చేస్తారు. అనంతరం సభని ఉద్దేశించి ప్రసంగిస్తారు అని తెలిపారు. సీఎం ప్రసంగించే సభ స్థలాన్ని , హెలిప్యాడ్ స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమితోపాటు జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, అనంతపురం ఆర్డీవో మధుసూదన్, ప్రభుత్వ విద్యా సలహాదారు సాంబశివా రెడ్డి, అడిషినల్ ఎస్పీ నాగేంద్రుడు, డిఎస్పీ ప్రసాద్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు పైలా నరసింహాయ్య, వైసీపీ సీనియర్ నాయకులు నార్పల సత్యనారాయణ రెడ్డి ఎంఈఎంఎస్ రాష్ట్ర డైరెక్టర్ మండల కన్వీనర్ నిట్టూరు రఘునాథరెడ్డి, జడ్పీ వైస్ చైర్ పర్సన్ నాగరత్నమ్మ, ఎంపీపీ నాగేశ్వరరావు, తహశీల్దార్ నారాయణస్వామి, ఎంపీడీవో దివాకర్, రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ సందీప్, వివిధ శాఖల అధికారులు, వైసీపీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ ఎం. గౌతమి జిల్లా ఉన్నతాధికారులను స్థానిక అధికారులను కోరారు..










