ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం పుట్లూరు మండలం చింతకుంట్ల గ్రామంలో ఉపాధి కూలీల సమస్యలను నేతలు అడిగి తెలుసుకున్నారు. కూలీలకు మెడికల్ కిట్టు, మజ్జిగ, పట్టా సౌకర్యములు లేవని వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుందని నేతలు తెలిపారు. కష్టానికి తగిన కూలీ లేదని, రూ.120 లోపు మాత్రమే ఇస్తున్నారని కనీస కూలి రూ.273 ఇవ్వాలని కానీ కనీస కూలీ కూడా అందడం లేదని కూలీలంతా వాపోయారు. ఉపాధి కూలీల సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.సూరి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వీటి రామాంజనేయులు, మండల అధ్యక్షుడు టి.పెద్దయ్య, మండల కార్యదర్శి భాస్కర్ రెడ్డి, రైతు సంఘం మండల కార్యదర్శి జి.వెంకట చౌదరి మాట్లాడుతూ.. ఉపాధి కూలీల సమస్యలను తీర్చకపోతే భారీ ఎత్తున ఆందోళన చేయటానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవి నాగమ్మ నాగశ్రీ, శ్రీవిద్య, అనురాధ తదితరులు పాల్గొన్నారు.










