Jan 23,2023 10:27

ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : మండలంలోని పచ్చికాపల్లం పంచాయితీ ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన వైసిపి రాష్ట్ర బిసి నాయకులు నేల్లేపల్లి మునస్వామి ఎంటికేలకు ఉప ముఖ్యమంత్రి కే.నారాయణస్వామి ఆశీస్సులతో ఎస్‌ఆర్‌ పురం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా పదవి దక్కించుకున్నారు. వైసిపి ఆవిర్భావం నుంచి పచ్చికాపల్లం పంచాయతీతోపాటు మండలం నియోజకవర్గస్థాయిలో పార్టీ, బలోపేతానికి విశేష కృషిచేసిన ఎన్‌.మునస్వామికి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి దక్కడంతో మండల ప్రజల నుంచి వైసిపి నాయకులు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో నెల్లేపల్లి మునస్వామి ఆదివారం రాత్రి డిప్యూటీ సిఎం క్యాంప్‌ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి డిప్యూటీ సిఎం ను సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా నేల్లేపల్లి మునస్వామి సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ... వైసిపిలో కష్టపడినందుకు పార్టీ అధిష్టానం ఉప ముఖ్యమంత్రి కే నారాయణస్వామి అండదండలతో చైర్మన్‌ పదవి రావడం జరిగిందని చెప్పారు. తమ కుటుంబం డిప్యూటీ సిఎంకు జన్మజన్మలకూ రుణపడి ఉంటామని స్పష్టం చేశారు. తనకు ఈ పదవి రావడానికి కృషిచేసిన వెదురుకుప్పం మండలం వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినాయకులకు, కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి కే.నారాయణస్వామి సలహా మేరకు వీలైనంత త్వరలో ఎస్‌ఆర్‌ పురం మార్కెట్‌ కమిటీ ప్రమాణ స్వీకారం మహౌత్సవం నిర్వహిస్తామని తెలియజేశారు.