Jul 10,2023 12:12

ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమ గోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరు పంచాయతీ పరిధి భరత్‌ నగర్‌ కు రూ.5 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డుకు గ్రామ సర్పంచ్‌ నేలపూడి బేబీ రామ్మోహన్‌రావు సోమవారం కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ... సిసి రహదారి నాణ్యత విషయంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా నిర్దేశించిన సమయానికి కాంట్రాక్టర్లు పని పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ జీ.శ్రీనివాసరావు, ఎంపీటీసీలు తాళం శ్రీనివాస్‌, సుబ్బారావు, పంచాయతీ కార్యదర్శి జివివి సత్యనారాయణ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.