ప్రజాశక్తి-నౌపడ (శ్రీకాకుళం) : నౌపడ పంచాయతీ ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతి అక్రమాలు చోటుచేసుకున్న అసిస్టెంట్లపై చర్యలు తీసుకోకపోవడంపై నౌపడ గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అదే పంచాయతీలోని పలు గ్రామాల్లో ఉపాధి పనులు కల్పిస్తూ నౌపడలోని కార్మికులకు మాత్రం ఉపాధి కల్పించుకోకపోవడంపై వేతనదారులు సోమవారం ఆందోళన చేశారు. అనంతరం నౌపడ గ్రామ సచివాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఫీల్డ్ అసిస్టెంట్‌లను వేతనదారులు నిర్బంధించడంతో వారి నుండి తప్పించుకొని బయటకు పరుగులు తీశారు. క్షేత్ర సహాయకులు బొమ్మాళి రామారావు, నీలాపు ప్రసాద్ రెడ్డి పరుగులు పెట్టడంతో వేతనదారులు వారిని వెంబడించారు. సచివాలయం వద్ద నౌపడ గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు.










