పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : పాలకొల్లు కళా పరిషత్ ఆధ్వర్యంలో ఏప్రియల్ 7, 8, 9 తేదీలలో జాతీయ స్థాయి నాటికల పోటీలు నిర్వహించనున్నట్లు సంస్థ అధ్యక్షులు కె.వి.కృష్ణ వర్మ తెలిపారు. స్థానిక మెయిన్ రోడ్ లోని అద్దేపల్లివారి సత్రం ప్రాంగణంలో పోటీలను నిర్వహిస్తున్నట్లు కె.వి.కృష్ణ వర్మ శనివారం తెలిపారు. ఈ నాటికల పోటీలలో ప్రదర్శించే ప్రతి నాటికకు రూ.15,000, ప్రదర్శనా పారితోషకం అందజేస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు మేడికొండ శ్రీనివాసరావు తెలిపారు. పోటీలలో పాల్గొనే నాటికలకు ఉత్తమ ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులతోపాటు, వ్యక్తిగత బహుమతులు అందజేస్తామని కార్యదర్శి జక్కంపూడి కుమార్ తెలిపారు. నాటికల పోటీలకు 7 నాటికలు ఎంపిక చేశామని కృష్ణ వర్మ తెలిపారు. ఏప్రియల్ 7 వ తేది మొదటి రోజు శర్వాణి గిరిజన సాంస్కృతిక కేంద్రం- బొరివంక (శ్రీకాకుళం) వారి కొత్త పరిమళం, అమఅతలహరి-గుంటూరువారి నాన్నా నేనొచ్చేస్తా, ఏప్రియల్ 8వ తేది రెండవ రోజు ఉషోదయ కళా నికేతన్-కట్రపాడువారి ప్రక్షాళన, సాయి రాఘవేంద్ర మూవీ మేకర్స్-గుంటూరు వారి కెరటాలు, మద్దుకూరి క్రియేషన్స్-చిలకలూరిపేటవారి మృత్యుపత్రం, ఏప్రియల్ 9 వ తేది చివరిరోజు అరవిందా ఆర్ట్స్-తాడేపల్లి వారి వెండి అంచులు, అభినయ ఆర్ట్స్-గుంటూరువారి అతీతం నాటికలు ప్రదర్శింపబడతాయని వర్మ తెలిపారు. నాటికల పోటీలకు ముఖ్య అతిథిలుగా స్థానిక ప్రజా ప్రతినిధులుతోపాటు ప్రముఖ సినీ నిర్మాత బన్నీ వాసు పాల్గొంటారని సమావేశంలో పాల్గొన్న సంస్థ ప్రధాన కార్యదర్శి మానాపురం సత్యనారాయణ, అధ్యక్షులు మేడికొండ శ్రీనివాస్ చౌదరి, కార్యదర్శి జక్కంపూడి కుమార్, కొనిజేటి సుబ్రమణ్యం గుప్తా, ఉపాధ్యక్షులు కేఎస్పీఎన్ వర్మ, విటాకుల వెంకటరమణ, కార్యవర్గ సభ్యులు కొల్లికొండ ప్రసాద్, దాసరి నాని, నడపన శ్రీనివాస్, సోమంచి శ్రీనివాస శాస్త్రి, షేక్ పీర్ సాహెబ్, రెడ్డి వాసు, జి ఎస్ ఎన్ ఆర్ రవి తెలిపారు.










